హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ

18 Nov, 2022 14:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను ఆయన ఇంట్లో సీఐడీ ప్రశ్నించింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలపై అధికారులు విచారణ జరిపారు.

160 సీఆర్‌పీసీ కింద ఇప్పటికే నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగ్‌రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలైన్‌మెంట్ మార్చడంతో రామకృష్ణా హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్‌కు లబ్ధి చేకూర్చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది.

అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్‌మెంట్ మార్పులు చేసిట్టు గుర్తించారు. ఇప్పటికే నారాయణ బెయిల్‌ను సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. 
చదవండి: ఈడీ విచారణలో ఎల్‌ రమణకు తీవ్ర అస్వస్థత

మరిన్ని వార్తలు