మోదీ సర్కారే టార్గెట్‌.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న కేసీఆర్‌

29 Jan, 2023 18:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

ఇక, సమావేశంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే, గవర్నర్ల వ్యవస్థపై పోరాడాలని పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. పార్లమెంట్‌ వేదికగా తెలంగాణకు రావాల్సిన నిధులపై నిలదీయాలని తెలిపారు.

రాష్ట్ర విభజన హామీలపై ప్రశ్నించాలని ఎంపీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచనలు చేశారు. పార్లమెంట్‌ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 

మరిన్ని వార్తలు