ప్రతి కలెక్టరేట్‌లో రాష్ట్ర చాంబర్‌ ఏర్పాటు: సీఎం కేసీఆర్‌

26 Jun, 2021 19:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రతి కలెక్టరేట్‌లో "రాష్ట్ర చాంబర్‌" ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రుల పర్యటనల సందర్భంగా వారి సౌకర్యార్థం ఇవి ఉపయోగపడతాయన్నారు. అదే విధంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలో "జంట హెలిపాడ్‌"లను ఏర్పాటునకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థలాల వివరాలను జులై నెలాఖరుకల్లా సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్‌.. ఆ వివరాలను రికార్డ్‌ చేయడానికి జిల్లాకు ఒక ఎస్టేట్‌ ఆఫీసర్‌ను నియమించాలని సూచించారు. వీరు ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పని చేయాలి... అలాగే రాష్ట్ర స్థాయి ఎస్టేట్ ఆఫీసర్‌ను నియమించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణ లో విధులు నిర్వహించేలా చూడాలని పేర్కొన్నారు.

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌.. పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతోపాటు పలువురు అధికారులు హాజరైన ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌... ‘‘పల్లెలు పట్టణాల అభివృద్ది కోసం ఖర్చు చేసేందుకు...మంత్రుల వద్ద 2 కోట్లు... ప్రతి జిల్లా కలెక్టరుకు ఒక కోటి రూపాయల ఫండ్‌ను కేటాయిస్తున్నాం. ఎమ్మెల్సీ లు ఎమ్మేల్యేలు.. నియోజకవర్గ అభివృద్ది నిధులను (సీడీఎఫ్‌) స్థానిక జిల్లా మంత్రి నుంచి అప్రూవల్ తీసుకొని ఖర్చు చేయాలి’’ అని దిశా నిర్దేశనం చేశారు.

చదవండి: కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

మరిన్ని వార్తలు