వరంగల్‌ అర్బన్‌ను హన్మకొండ జిల్లాగా మారుస్తున్నాం: కేసీఆర్‌

21 Jun, 2021 20:48 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వరంగల్‌ పరిశ్రమల కేంద్రంగా కావాలని ఆయన తెలిపారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండగా మారుస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వరంగల్‌ రూరల్‌ వరంగల్‌ జిల్లాగా ఉంటుందన్నారు. ఇకపై హన్మకొండ, వరంగల్‌ జిల్లాలు ఉంటాయన్నారు. వరంగల్‌ కలెక్టరేట్‌ను త్వరలోనే నిర్మిస్తామని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో కలెక్టరేట్‌ భవనాలు చాలా బాగున్నాయన్నారు.

నిన్ననే వరంగల్‌ జిల్లాలకు వెటర్నరీ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కలెక్టర్‌ పేరు కూడా మార్చాలన్నారు. అది బ్రిటిష్‌ కాలంలో పెట్టిన పేరు అని తెలిపారు. ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్‌ సమస్యలు తీరాయన్నారు. పారదర్శకత పెరిగితే పైరవీలు ఉండవన్నారు. వరంగల్‌ విద్యా, వైద్య, పరిశ్రమల కేంద్రం కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి పాత తాలుకాలో మాతాశిశు సెంటర్లు రావాలని, వరంగల్‌కు డెంటల్‌ కాలేజీతోపాటు ఆస్పత్రి మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.

వైద్యరంగంపై దాడులు సరికావు
‘వైద్యరంగం మీద దాడులు సరికావు. చైనాలో 28 గంటల్లో 10 అతస్తుల భవనం కట్టారు. ఏడాదిన్నరలో ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలి. ప్రపంచంలోనే వైద్య సేవలు కెనడాలో బాగున్నాయని అంటారు. అక్కడ వైద్య శాఖ అధికారులు పర్యటించి పరిస్థితులు తెలుసుకోవాలి. కరోనాపై దుష్ప్రచారం సరికాదు. నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా వస్తే టెంపరేచర్‌ పెరుగుతుంది. విపరీతంగా జ్వరం వస్తే రెండే రెండు గోళీలు వేసుకోమన్నారు డాక్టర్లు. పారసిటమాల్ లేదా డోలో గోలి. ఇంకేం అవసరం లేదు. రెండోది ఏందయ్యా అంటే ఏదన్న ఒక యాంటీ బయాటిక్ గోలీ వేసుకోమన్నారు. మీ శరీరానికి ఏదైతే మంచిగ పడుతదో ఆ యాంటీ బయాటిక్ వేసుకుంటే సరిపోతుంది అని డాక్టర్లు చెప్పారు. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దు.

జైలు కూల్చతే నాకేమైనా వచ్చేది ఉందా. అయినా కూడా కొందరు విమర్శించారు. ఆశా వర్కర్లు ఇంటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేశారు. వాళ్లకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. వరంగల్‌లో కరువు మాయం కావాలి. దేవాదుల ప్రాజెక్టు వరంగల్‌ జిల్లాకే అంకితం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ కోసం పరితపించారు. 50 ఏళ్లు పోరాటం చేశారు. జులై 1-10 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని తెలిపారు  
చదవండి: వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు