ఉన్న వనరుల్నే వాడుకుంటాం : సీఎం రేవంత్‌

14 Dec, 2023 16:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ)లోని ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం మీడియా చిట్‌ చాట్‌లో పాల్గొని కీలక విషయాలు వెల్లడించారు. ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీలోని ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ నిర్మిస్తామని, కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని అన్నారు.

అధికారుల నియామకంలో ఫైరవీలు ఉండని అన్నారు. అధికారుల బదిలీలు ఉంటాయని, కానీ బదిలీ విషయంలో వారి వెంటపడమని సీఎం రేవంత్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 12, 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేదన్నారు. అన్ని అంశాలపై, అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. రేపు(శుక్రవారం) బీఏసీలో సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని అ‍న్నారు. అదేవిధంగా రాయదుర్గం-ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ఉపయోగకరంగా ఉండదని, విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రోను ప్లాన్‌ చేస్తామని సీఎం రేవంత్‌ వెల్లడించారు.

చదవండి: ప్రజాభవన్‌లోకి భట్టి ఫ్యామిలీ గృహ ప్రవేశం

>
మరిన్ని వార్తలు