Delhi Liquor Scam Case: సీబీఐ విచారణకు హాజరుకానున్న సీఏ బుచ్చిబాబు

18 Oct, 2022 11:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, ఢిల్లీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు దూకుడు పెంచాయి. లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా మరికొందరికి నోటీసులు పంపించాయి.

ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను సోమవారం విచారించింది ఈడీ. ఇదే కేసులో హైదరాబాద్‌ వాసి అరుణ్‌ రామచంద్ర పిళ్లైని సీబీఐ విచారిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు పంపించగా.. ఈరోజు(మంగళవారం) సీబీఐ ముందు హాజరుకానున్నారు సీఏ బుచ్చిబాబు. రాబిన్‌ డిస్టిలరీస్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురికి చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేశారు బుచ్చిబాబు. ఇప్పటికే ఢిల్లీలో ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్‌ను ఈడీ అరెస్ట్ చేసి విచారిస్తోంది.

ఇదీ చదవండి: Delhi Liquor Scam: అభిషేక్‌ ఇచ్చిన సమాచారంతో అతడి విచారణ.. మరిన్ని అరెస్టులకు ఛాన్స్‌!

మరిన్ని వార్తలు