టైఫాయిడ్‌లోనూ వైద్య సేవలందిస్తూ.. 

28 Sep, 2023 09:34 IST|Sakshi
మణుగూరు వందపడకల ఆస్పత్రిలో వైద్యురాలు కృష్ణశ్రీ  

సాక్షి,  భద్రాద్రి కొత్తగూడెం: టైఫాయిడ్‌ జ్వరంతో బాధ పడుతూ చేతికి సెలైన్‌తోనే విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు వైద్యురాలు కృష్ణశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ప్రభ్వుత్వాస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణశ్రీ కొద్దిరోజులుగా టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం అయితే చేతికి సెలైన్‌ కూడా పెట్టుకున్నారు.

అంత అనారోగ్యంలో కూడా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 24 గంటలపాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించారు. ఇన్‌ పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వారి రికార్డులను పరిశీలించారు. కృష్ణశ్రీ గతంలో వరదల సమయంలో కూడా పేషంట్లకు విశేషమైన సేవలందించిన ఆదర్శంగా నిలుస్తున్నారు.
చదవండి: ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి

మరిన్ని వార్తలు