ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్‌

22 Oct, 2023 04:30 IST|Sakshi

తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు టెండర్లను పిలవొద్దన్న ఈసీ 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్‌ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద మిల్లింగ్‌ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్‌ కింద మిల్లింగ్‌ జరు గుతోంది.

మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్‌ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్‌లను ఆహ్వానించింది.

ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.నిరంజన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు