ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి

15 Sep, 2023 05:52 IST|Sakshi

వారికి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉండటం వల్లేనంటున్న అధికారులు

సీజనల్‌ వ్యాధులపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష

24 గంటల కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్‌ సెల్‌ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్‌ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు.

జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు...
రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్‌ వోలు హైరిస్క్‌ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్‌ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు