ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్‌ పరిష్కారం 

4 Feb, 2022 06:06 IST|Sakshi

ప్రతి ఆదివారం.. ప్రాపర్టీ టాక్స్‌ పరిష్కారం 

ఈ నెల 6 నుంచి మార్చి 27 వరకు 

ఏర్పాట్లు చేపట్టిన జీహెచ్‌ఎంసీ  

సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 6 నుంచి మార్చి చివరి ఆదివారం 27వ తేదీ వరకు  ఆదివారాల్లో ప్రాపర్టీ టాక్స్‌ పరిష్కారం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్వరలోనే ముగియనున్న నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లు పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఇందుకు సిద్ధమైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జీహెచ్‌ఎంసీలోని అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అసెస్‌మెంట్స్‌ వ్యత్యాసాలు, కోర్టు వివాదాలకు సంబంధించి ప్రజలు అధికారులతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చని కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆస్తి పన్నుకు సంబంధించి ఇతరత్రా సమస్యలను సైతం సత్వరం పరిష్కరించుకు నేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయని చెప్పారు.  

ఏయే తేదీల్లో.. 
ప్రాపర్టీ టాక్స్‌ పరిష్కారం కార్యక్రమం నిర్వహించే ఆదివారాల తేదీలు ఇలా ఉన్నాయి. 
ఫిబ్రవరి: 6, 13, 20, 27. 
మార్చి: 6, 13, 20, 27 
8 వారాల్లో ప్రజల ఇబ్బందులు తొలగించడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఏటికేడాది ఆస్తిపన్ను వసూళ్లు పెరుగుతు న్నప్పటికీ, వివిధ ప్రాజెక్టుల పేరిట ఖర్చులు పెరిగిపోవడంతో దీని ద్వారా మరింత ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు  వరకు రూ.1362 కోట్లు వసూలు కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 2 వరకు  రూ.1180 కోట్లు వసూలైంది.

గ్రేటర్‌లోని ఆరు జోన్లకుగాను శేరిలింగంపల్లి జోన్‌ గత సంవత్సరం  ఫిబ్ర వరి నెలాఖరు వరకు వసూలైన దానికంటే ఎక్కువ వసూలు చేసింది. ఫిబ్రవరి నెలా ఖరు వరకు రూ.245 కోట్లు వసూలు కాగా,  రూ.251 కోట్లు వసూలయ్యాయి.   

>
మరిన్ని వార్తలు