ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలి: జీటీఏ 

18 Nov, 2022 00:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఐఓఎస్, డైట్‌ లెక్చరర్స్, జూనియర్‌ లెక్చరర్స్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వ టీచర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని గురువారం కలిసిన సంఘం నేతలు ఈమేరకు వినతి పత్రం అందజేశారు.  

మరిన్ని వార్తలు