నా పెళ్లి జరగనివ్వండి.. మహా ప్రభో

7 Sep, 2023 12:34 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ట్రాఫిక్ జామ్ కావడంతో పెండ్లి ముహూర్తం దాటిపోతోందని వరుడు కారు నుండి దిగి అధికారులను ట్రాఫిక్ క్లియర్ చేయాలని వేడుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మూడు భారీ క్రేన్లతో ఆయిల్ ట్యాంకర్ లారీని తీయడానికి ఏర్పాట్లు చేశారు.

ఇందులో భాగంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలను నిలిపి లారీని తీస్తుండగా వరంగల్ నుండి తొర్రూర్‌కు వెళ్తున్న పెండ్లి కొడుకు కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం ఉండటంతో పెండ్లి కుమారుడు ముహూర్తం దాటిపోతోందని ట్రాఫిక్ క్లియర్ చేయాలని కారు దిగి రోడ్డుపై నడిచాడు. భారీ క్రేన్ల వద్దకు చేరుకొని అధికారులను త్వరగా వాహనాలను పంపించాలని పెండ్లి ముహూర్తం దాటిపోతుందని వేడుకున్నాడు.

దీంతో అధికారులు పెట్రోల్ ట్యాంకర్ ఉండటంతో ఇబ్బంది ఏర్పడిందని కాస్త సమయం కావాలని సూచించారు. ట్రాఫిక్ క్లియర్ కావడం లేదని భావించిన పెండ్లి కుమారుడు కారును మళ్లీ వెనక్కి తిప్పి కొంత దూరం ప్రయాణించాడు. ఇంతలోనే వాహనాలు కదిలి ముందుకు వెళ్లడంతో  మళ్లీ వెనక్కి వచ్చి తొర్రూర్‌కు వెళ్లిపోయాడు.
చదవండి: ఒంగోలు బ్యూటీపార్లర్‌ కేసు: మార్గదర్శి మేనేజర్‌ భార్య అరెస్ట్‌

మరిన్ని వార్తలు