వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్‌

13 Sep, 2023 14:49 IST|Sakshi

ఇటీవల యువత వివాహంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. వెడ్డింగ్‌ కార్డుల దగ్గర నుంచి వివాహ తంతు వరకు ఏదో ఒక విషయంలో వినూత్న రీతిలో ప్రత్యేకత చూపిస్తున్నారు. అవన్నీ అదరహో అనేలా ఉంటున్నాయి. అబ్బా! ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అనేంతగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి ఆ డిఫరెంట్‌ ఐడియాలు. ఇక్కడ కూడా ఓ జంటా అలానే చేసి బంధువులంతా వావ్! అని ఆశ్చర్యపోయేలా చేసింది. 

ఓ జంట కళ్యాణ మండపానికి ఇచ్చిన ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉంది. అక్కడ ఉన్నవాళ్లంతా వధువుని అలా చూసి స్టన్‌ అయిపోయారు. ఆ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఓ మహారాణి మాదిరిగానే వచ్చింది. కాకపోతే కొంచెం డిఫెరెట్‌గా వచ్చింది. మాములుగా రాణుల వచ్చేటప్పడూ వెనక వైపు పొడుగుగా ఉండే క్లాత్‌ని సేవకులు మోస్తు తీసుకొస్తారు.

ఔనా! కానీ ఇక్కడ బెలూన్‌ల సాయంతో ఆ క్లాత్‌ని పైకెత్తించి తీసుకువచ్చారు. ఆ వధువు స్టయిలిష్‌గా అలా వరుడు చేతిలే చేయి వేసి వస్తుంటే..బంధువలంతా నోరెళ్లబెట్టి..చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: ఆ ఒక్క సంజ్ఞతో..ఆ ఆవుల మందను కదలకుండా చేశాడు!)

A post shared by Surrey Memes 🇨🇦 (@thesurreymemes)


 

మరిన్ని వార్తలు