తిరుమల శ్రీవారి పాదరక్షలు ఎందుకు అరిగిపోయి ఉంటాయి?

7 Sep, 2023 12:33 IST|Sakshi

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పాదరక్షలకోసం ఏటేటా తిరుమలకు ఉత్తరాన గల శ్రీకాళహస్తి గ్రామం, దక్షిణానగల కాంచీపుర గ్రామాలలోని చర్మకారులకు శ్రీవారి పాదముద్రలు ఇస్తారు. వారిరువురు విడివిడిగా ఆ పాదముద్రల కొలతలతో పాదరక్షలను చేసి వాటిని శిరస్సున పెట్టుకుని, ఊరూరా తిరిపమెత్తుకుంటూ వచ్చి అలిపిరి పూజ చేసి ఆ పాదరక్షను పూజామందిరంలో ఉంచుతారు.

ఈ కొత్తపాదరక్షలు తయారై వచ్చే సమయానికి పాత పాదరక్షలు చాలావరకు అరిగిపోయి ఉంటాయి. శ్రావణ శనివారాలు ఉపవాసం ఉండి, పిండి తళిగలు వేస్తారు. ఆ పిండిమీద శ్రీవారి పాదముద్రలు వేస్తారు. ఆ రెండు పాదముద్రలను ఒకరికి తెలియకుండా మరొకరికి ఇస్తారు. 

శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన ఎందుకు?
సిరులను, సంపదలను, సకలైశ్వర్యాలను కోరగానే భక్తులకు అందించే శ్రీమహాలక్ష్మికి పూవులన్నా, గాజులన్నా, కుంకుమన్నా బహుప్రీతి. విష్ణుమూర్తి అలంకారపియుడు కావడానికి బహుశ ఇదే కారణమేమో! పరమేశ్వరునికి పాలతో, ఉదకంతో అభిషేకం చేయడం, ఆంజనేయునికి సింధూరం పూత  పూయడం, విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం ఎంతటి సత్ఫలితాలను ఇస్తుందో, శ్రీ మహాలక్ష్మికి కుంకుమతో చేసే పూజ అంతటి దివ్యసంపదలను అందిస్తుంది. త్వరిత గతిన శుభాలను చేకూరుస్తుంది.

మరిన్ని వార్తలు