సీసాలో ఎడ్లబండి..బియ్యం గింజపై రైతు

23 Dec, 2020 15:31 IST|Sakshi

హసన్‌పర్తి: వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన విద్యార్థి సోమోజు కిరణ్‌కుమార్‌ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఓ సీసాలో వ్యవసాయానికి ప్రధాన అవసరమైన ఎడ్ల బండిని రూపొందించాడు. బాటిల్‌ ఎక్కడా పగలకుండా ఎంతో జాగ్రత్తతో ఈ కళారూపం తీర్చిదిద్దాడు. దీన్ని తయారుచేయడానికి నెల సమయం పట్టిందని కిరణ్‌కుమార్‌ తెలిపాడు. ఎంఎస్సీ ఫిజిక్స్‌ పూర్తి చేసిన కిరణ్‌ ప్రస్తుతం స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. 

బియ్యం గింజపై రైతు..
జగిత్యాల టౌన్‌: జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ గతంలో ఎ న్నో సూక్ష్మ కళాకృతులు తయారుచేశారు. తా జాగా బియ్యపు గింజ మధ్యలో నాగలి పట్టుకుని నడుస్తున్న రైతు ఆకృతిని బంగారంతో తయారుచేసి పొందుపర్చాడు. పొడవు 0.95 మిల్లీమీటర్లు, వెడల్పు 0.43 మిల్లీమీటర్లు, 0.01మిల్లీ బంగారంతో రైతన్న విగ్రహం తయారీ చేసినట్లు, దీనికి సుమారు 6 గంట ల సమయం పట్టిందని దయాకర్‌ మీడియా కు తెలిపాడు. ఈ విధంగా జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా బియ్యపు గింజలో రైతన్న రూపాన్ని ఆవిష్కరించి రైతన్నపై సమాజానికి ఉన్న గౌ రవాన్ని చాటాడు. దయాకర్‌ గతంలో గాంధీ జయం తిన గుండు పిన్నుపై గాంధీ విగ్రహాన్ని చెక్కాడు. గురుపూజోత్సవం సందర్భంగా గురుశిషు్యల అనుబంధా న్ని గుండుపిన్నుపై ఆవిష్కరించాడు. 

మరిన్ని వార్తలు