సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. కంటిన్యూ

18 Dec, 2023 11:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ మరో మూడు రోజులు కొనసాగనుంది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన తెలంగాణ హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది.  

సింగరేణిలో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఈసారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యంగా కాగా.. డిసెంబర్‌ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు . ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా విడుదలై.. ఎన్నికల నిర్వహణ కసరత్తులు జరుగుతున్నాయి.  


అయితే.. రాష్టంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం తో పాటు వివిధ విభాగాల సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ వెంటనే పార్లమెంట్‌ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. మార్చిలో నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి పేరిట పిటిషన్‌ దాఖలైంది. అదే సమయంలో వాయిదా యత్నాలను పసిగట్టి ముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐటీయూసీ సంఘం. దీంతో ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్ పై స్టే ఇవ్వకుండా విచారణ చేపట్టింది హైకోర్టు. 

>
మరిన్ని వార్తలు