శంషాబాద్‌లోని ఆ 181 ఎకరాలు HMDAవే.. అక్రమార్కుల పిటిషన్‌ డిస్మిస్‌

14 Dec, 2023 19:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ హైకోర్టులో హైదరాబాద్ మహనగర అభివృద్ధి సంస్థ(HMDA)కు భారీ ఊరట లభించింది. శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములు హెచ్‌ఎండీఏవేనని హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆశ్రయించినట్లు గుర్తించిన కోర్టు.. వాళ్ల తీరును తప్పుబడుతూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. 

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏకు చెందిన 181 ఎకరాల భూముల్లో.. 50 ఎకరాల భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ మేరకు కోర్టులో పత్రాలు సమర్పించి మరీ రిట్‌ పిటిషన్‌​ వేశారు కొందరు. అయితే సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్‌ఎండీఏ ఆధీనంలోని భూముల్లో పొజిషన్‌ కోసం ప్రయత్నించారని హెచ్‌ఎండీఏ వాదించింది. ఇరువైపులా వాదనలు నవంబర్‌ 18వ తేదీన పూర్తికాగా.. తీర్పును రిజర్వ్‌ చేసింది డివిజన్‌ బెంచ్‌. 


ఈ క్రమంలో పిటిషనర్లు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించిన ఉన్నత న్యాయస్థానం డివిజన్‌ బెంచ్‌.. ఇవాళ రిట్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెల్లడించింది. తీర్పు వెల్లడించే క్రమంలో అక్రమార్కుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, తమ ఉన్నతాధికారుల చొరవతో మొత్తానికి హెచ్‌ఎండీఏ కేసు గెలిచింది.

>
మరిన్ని వార్తలు