దేశీయ వర్సిటీల్లో హెచ్‌సీయూకు మొదటి స్థానం

30 Jul, 2021 03:16 IST|Sakshi

రాయదుర్గం (హైదరాబాద్‌): దేశీయ యూనివర్సిటీల్లో హైదరాబా ద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది. నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌–2021లో మొదటి స్థానంలో నిలిచింది. నేచర్‌ ఇండెక్స్‌ ఏటా ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్‌ ప్రకటిస్తోంది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో హెచ్‌సీయూకు 17వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హెచ్‌సీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బీజేరావు మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో వర్సిటీకి మెరుగైన ర్యాంకింగ్‌ సాధించడంపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. పరిశోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఈ ర్యాంకింగ్‌ దోహదం చేస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు