Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వాన.. చెరువులైన లోతట్టు ప్రాంతాలు

16 Oct, 2021 20:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడింది. శనివారం మధ్యాహ్న సమయంలో నగరం వర్షంతో తడిసిముద్దయ్యింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, ఉప్పల్‌, అంబర్‌పేట్‌, రామంతపూర్‌లో భారీ వర్షం కురిసింది. ఇక మలక్‌పేట్‌, దిల్‌షుక్‌నగర్‌లో కుండపోతగా వర్షం కురవడంతో ఆయా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

నగరంలోని చైతన్యపురి కాలనీ నీట మునిగింది రహదారులు చెరువుల్లా మారడంతో చాలాచోట్ల ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జోరువాన, వరదలతో మ్యాన్‌ హోళ్లు పొం‍గుతున్నాయి. వర్షాలు, వరదలపట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. 

ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం అల్లాడుతున్నారు. గ్రేటర్‌లో వర్షాలకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు