హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ వడగండ్ల వాన

16 Mar, 2023 14:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణశాఖ తెలిపిన విధంగా ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. ఇక, హైదరాబాద్‌లో గురువారం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. 

నగరంలోని నాగోల్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లా జిల్లాలో వడగండ్ల వర్షం పడుతోంది. పశ్చిమ బెంగాల్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా అల్పపీడన ద్రోణి కారణంగా గంటకు 40 కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో, వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు