ఎదురింటి యువకుడితో వివాహేతర సంబంధం..

21 Mar, 2022 08:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గొల్లపల్లి (కరీంనగర్ ): ఓ వివాహిత మరొకరితో వివా హేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి మందలించినా ఆమెలో మార్పు రాలేదు. భార్య చేసిన మోసం అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఆమె వివాహిత ప్రియుడు, కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి, గొడవ చేయడంతో ఇక బతకొద్దని నిర్ణయించుకొని, తనువు చాలించాడు. మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గొల్లపల్లికి చెందిన జేరిపోతుల హన్మాండ్లు–దేవమ్మ దంప తులకు ముగ్గురు కుమారులు. వీరి చిన్న వయసు లోనే తండ్రి చనిపోయాడు. తల్లి దేవమ్మే పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు గంగాధర్‌(35)కు పదేళ్ల కిందట తిరుపతమ్మతో పెళ్లి జరిపించింది . వీరికి ప్రమోద్‌ సంతానం.

 కాగా తిరుపతమ్మ పెళ్లయిన రెండేళ్లకే అనారోగ్యంతో మృతి చెందింది. తర్వాత గంగాధర్‌ పెగడపల్లి మండలం నంచర్లకు చెందిన మమతను రెండో వివాహం చేసుకున్నాడు. గ్రామంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ, సామాజిక కా ర్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకున్నా డు. కానీ పెళ్లి జరిగి, ఆరేళ్లయినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. ఈ క్రమంలో మమత జేరిపోతుల అభిషేక్‌ అనే ఎదురింటి యువకుడితో వివా హేతరం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలి సిన భర్త పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు ఆమె ను హెచ్చరించాడు. అయినా మమత ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అభిషేక్‌తోపాటు అతని కు టుంబసభ్యులను మందలించాడు.

 ఈ నెల 11న మమత తన ప్రియుడితో కలిసి గంగాధర్‌కు పట్టుబడింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరి గింది. గత శనివారం రాత్రి అభిషేక్, అతని కుటుంబసభ్యులు గంగాధర్‌ ఇంటికి వచ్చి గొడవ చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి,∙తల్లి దేవమ్మ బోరున విలపించింది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు మందలించినా కోడలు వినలేదని తెలిపింది. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యులు తమను చంపేస్తామని బెదించారని, అందువల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ఈ మేరకు మమత, అభిషేక్‌లపై కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. అయితే దేవమ్మ తన కుమారుడి మృతికి అభిషేక్‌ తల్లి లక్ష్మి, తండ్రి కిష్ఠయ్య, జేరిపోతుల రాకేశ్, మహేశ్, శంకర్, అతని భార్య అమ్మాయిలు కూడా కారణమని చెప్పిందన్నారు. విచారణలో నిజమని తేలితే అందరిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఎస్పీ ప్రకాశ్‌ బాధితుల ఇంటికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్, డీసీసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పరామర్శించారు. 

మరిన్ని వార్తలు