జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు.. గాల్లో తేలినట్లు ఉంది

23 Dec, 2021 14:29 IST|Sakshi

కిష్టాపూర్‌కు చెందిన 20 మంది గ్రామీణ మహిళలు విమానంలో తిరుపతికి ప్రయాణం  

స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకొని..

గాలిమోటార్‌ కల నిజమైందని సంబురం

సాక్షి,దోమ(వికారబాద్‌): సామాన్య ప్రజలు విమానం ఎక్కడం చాలా అరుదు. జీవితంలో ఒక్కసారైన ఎక్కాలనే ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. అయితే.. వారి కల నిజమైంది. దోమ మండల పరిధిలోని కిష్టాపూర్‌కు చెందిన 20 మంది సాధారణ మహిళలు తిరుపతికి విమానంలో వెళ్లి తమ కల నెరవేర్చుకున్నారు. వివరాలు.. గ్రామంలోని గౌడ్స్‌ కాలనీకి చెందిన మహిళలు పైసాపైస కూడబెట్టకొని తిరుపతికి విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఈమేరకు గ్రామానికి చెందిన ప్రసాద్‌తో టిక్కె ట్లను బుక్‌ చేయించుకొని అతడితో పాటే శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో మళ్లీ విమానంలో శంషాబాద్‌కు వచ్చారు. తమ జీవితంలో విమానం ఎక్కుతామో లేదో అనుకున్నామని, ఆ వేంకటేశ్వరుడి కృపతో కల సాకారం అయిందని తెగ సంబరపడిపోతు న్నారు. ఇప్పటికీ ఇది కలనా.. నిజమా అన్నట్లుగా.. గాలిలో తేలినట్లుగా ఉందని చెబుతున్నారు.

చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి..

మరిన్ని వార్తలు