హెచ్‌సీయూలో  29 వరకు ‘సుకూన్‌–2022’ 

27 May, 2022 13:08 IST|Sakshi

గచ్చిబౌలి: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో శుక్రవారం నుంచి సందడి నెలకొననుంది. ప్రతిష్టాత్మకమైన ‘సుకూన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హెచ్‌సీయూ క్యాంపస్‌లోని సుకూన్‌ గ్రౌండ్స్, కొమ్రమ్‌ భీమ్‌ ఓపెన్‌ డయాస్‌లో మూడు రోజులపాటు కార్యక్రమం కొనసాగనుంది.  కార్యక్రమంలో భాగంగా కొలేజ్‌ పోటీలు, డ్యాన్స్‌ పోటీలు, పాటల పోటీలు, ఫేస్‌ పెయింటింగ్‌ పోటీలు, బైత్‌బాజీ కార్యక్రమం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, రంగోలి, ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు. 

పోస్టర్‌ మేకింగ్‌ పోటీలు, మెహిందీ పోటీ, మొబైల్‌ ఫోటోగ్రఫీ, క్విజ్‌ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్‌నందన్‌ మాట్లాడుతూ ఈనెల 27,28,29 తేదీల్లో ‘సుకూన్‌–2022’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటి రోజు డప్పు చందు కార్యక్రమం, ట్రైబల్‌ ఫోక్‌ షో, సూఫీ ఖవ్వాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండో రోజు ఆర్కెస్ట్రా, రాక్‌ షోను నిర్వహించడం జరుగుతుందన్నారు. చివరిరోజైన మూడో రోజు డీజే నైట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు