హెల్మెట్‌ లేకుంటే  3 నెలలు లైసెన్స్‌ రద్దు!

6 Nov, 2020 02:03 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

రూ. వెయ్యి జరిమానా కూడా..

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో నియంత్రించడంపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ద్విచక్ర వాహన చోదకులతో పాటు వెనకాల కూర్చునే వారికి హెల్మెట్‌ లేకుంటే ఈ–చలాన్లు జారీ చేస్తున్న పోలీసులు.. ఇకపై మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మోటార్‌ వెహికల్‌ చట్టం– 2019 ప్రకారం హెల్మెట్‌ లేకుంటే రూ.వెయ్యి జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేయొచ్చన్న అంశాలు వాహన దారులకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘ఇప్పటివరకు జరుగుతున్న చాలా వరకు రోడ్డు ప్రమాదాల సమయంలో వాహన చోదకులకు హెల్మెట్‌ లేకపోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో హెల్మెట్‌ ధరించని వారికి జరిమానాతో పాటు 3 నెలల డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదించింది. ఇదే విషయాన్ని వాహనచోదకులకు అవగాహన కలిగించే దిశగా కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అదేశాను సారం చర్యలు తీసుకుంటాం’అని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు