గవర్నర్‌ తమిళిసైపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌

10 Jun, 2022 18:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌, టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. జగ్గారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్‌లో గవర్నర్‌ తమిళిసై మహిళా దర్బార్‌పెట్టారు. ఈ దర్బార్‌ పెట్టడం వల్ల గవర్నర్‌కు వచ్చే లాభమేమీ లేదు. మహిళా దర్బార్‌ పెట్టడం రాజకీయమే. మహిళా దర్బార్‌తో మహిళలకు ఒరిగేదేమీ లేదు. 

గవర్నర్‌ తమిళిసై జిల్లాల్లో పర్యటిస్తే ప్రొటోకాల్‌ లేదు. ప్రొటోకాల్ ఉల్లగించిన వారిపై చర్యలే తీసుకోలేదు. గవర్నర్ పరిపాలన వస్తే.. బీజేపీ పాలనే సాగుతుంది. బీజేపీ పాలన కావాలి అనుకునేవారు గవర్నర్ పాలన కోరుకుంటారు. ప్రభుత్వం సమస్యలు వినట్లే కాబట్టే ప్రజలు గవర్నర్‌ను కలిసి దరఖాస్తులు ఇస్తున్నారు. తాను ఏమీ చేయలేనని గవర్నర్‌కు కూడా తెలుసు. బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్.. గవర్నర్‌ అమలు చేస్తున్నారు. గవర్నర్‌ పిలిస్తే.. చీఫ్‌ సెక్రటరీ, డీజేపీ రాలేదు. తనకు జరిగిన అవమానంపై ఇంత వరకీ చర‍్యలు తీసుకోలేదు. ఇంకా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తన మాటలు కేవలం తన వ్యక్తిగతమేనని క్లారిటీ ఇచ్చారు. 

టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ కాంగ్రెస్‌ రాకుండా గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. మత విద్వేషాలతో ఓట్లు రాబట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. వ్యూహాత్మకంగానే గవర్నర్‌తో టీఆర్‌ఎస్‌ పార్టీ గ్యాప్‌ను మెయింటెయిన్‌ చేస్తోంది. రానున్న రాష్ట‍్రపతి ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం తెలిసిపోతుంది. కాంగ్రెస్ నిలబెట్టే సెక్యులర్ రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేస్తేనే గులాబీ పార్టీ సెక్యులర్ పార్టీ అని నిరూపితం అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: ఒకరికి పబ్‌లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్‌

మరిన్ని వార్తలు