హైకోర్టు జడ్జీల సంఖ్య పెంచండి

27 Aug, 2020 05:52 IST|Sakshi
కేంద్ర మంత్రి రవిశంకర్‌కు వినతి పత్రం ఇస్తున్న తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి. చిత్రంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, కిషన్‌రెడ్డి

కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిసి కోరారు. పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి, న్యాయ సేవలు వేగంగా అందడానికి వీలుగా ఈ చర్య తోడ్పడుతుందని వివరించారు. తెలంగాణ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 14 మందే ఉన్నారని తెలిపారు.

పెండింగ్‌ కేసులు భారీగా ఉన్నాయని, కొత్తగా పెద్ద సంఖ్యలో కేసులు వస్తుండడంతో న్యాయవ్యవస్థపై భారం పడుతోందని చెప్పారు. హైకోర్టులో ప్రస్తుతం ఉన్న సదుపాయాలు 46 నుంచి 48 మంది జడ్జీలు పనిచేయడానికి అనువుగా ఉన్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు