హైదరాబాద్‌: మహిళా ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్‌

18 Aug, 2023 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. లేడీస్‌ స్పెషల్‌ ట్రిప్‌లో భాగంగా..  లేడీస్‌ స్పెషల్‌ బస్సులను మళ్లీ  రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఈ క్రమంలో.. కోఠి-కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసింది. లేడీస్‌ స్పెషల్‌ బస్సును ఈ నెల 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుంది.

ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి నుంచి బయలుదేరి.. లక్డికాపుల్, మసబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషాకిరణ్, గుట్టల బేగంపేట్, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్‌రోడ్స్ మీదుగా కొండాపూర్‌కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చదవండి: కాంగ్రెస్‌ రూట్‌లో కమలం.. సర్‌ప్రైజ్‌ అందుకే!

ఇదిలా ఉంటే.. నగరంలో మహిళల ప్రత్యేక బస్సులు కొత్తేం కాదు. గతంలోనూ ఆర్డినరీ బస్సులు సైతం కొన్ని ఎంపిక చేసిన రూట్‌లలో తిరుగుతుండేవి. కాలక్రమేణా అవి తగ్గిపోతూ వచ్చాయి. నగరవాసులు సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అదే సమయంలో మెట్రో రైలు.. ఆర్టీసీ ఆదాయానికి బాగా గండికొట్టింది. సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీ అయ్యాక.. ఆక్యుపెన్సీని పెంచేందుకు రకరకాల పద్ధతులను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో నగరవాసులు బస్సు ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చేలా రకరకాల స్కీమ్‌ల్ని తీసుకొస్తున్నారు.   

మరిన్ని వార్తలు