Sakshi News home page

Audi: దేశీయ మార్కెట్లో మరో జర్మన్ కారు - ధర రూ. 1.14 కోట్లు

Published Fri, Aug 18 2023 7:18 PM

Audi Q8 E Tron India launched price variants specs and details - Sakshi

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు క్యూ8 ఇ-ట్రాన్‌ విడుదల చేసింది. ఇది మొత్తం నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారు ధరలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఆడి క్యూ8 ఇ-ట్రాన్ ప్రారంభ ధరలు రూ. 1.14 కోట్లు నుంచి రూ. 1.18 కోట్లు వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారు కోసం రూ. 5 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

కొత్త ఆడి క్యూ8 ఇ-ట్రాన్‌ 55 వేరియంట్లు 114 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి. లోయర్-స్పెక్ 50 వేరియంట్స్ 95 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి. ఈ రెండూ వరుసగా 350 అండ్ 408 హార్స్ పవర్ డెలివరీ చేస్తాయి. రేంజ్ విషయానికి వస్తే 50 వేరియంట్స్ 491 కిమీ (SUV) నుంచి 505 కిమీ (స్పోర్ట్‌బ్యాక్) వరకు.. 55 వేరియంట్స్ 582 కిమీ (SUV) నుంచి 600 కిమీ (స్పోర్ట్‌బ్యాక్) వరకు ఉంటాయని తెలుస్తోంది. ఆడి క్యూ8 ఇ-ట్రాన్‌ 22 కిలోవాట్ ఏసీ & 170 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇదీ చదవండి: ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక.. యూఐడీఏఐ కీలక ప్రకటన

ఇక డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. గ్రిల్ బ్లాక్ సరౌండ్‌లతో కొత్త మెష్ డిజైన్‌ కలిగి, ట్వీక్డ్ హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. ఇందులో 2డీ లోగో చూడవచ్చు. ఫ్రంట్ ఇప్పుడు గ్లోస్ బ్లాక్‌లో పూర్తయింది, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటీరియర్ దాదాపు దాని ముకుప్టి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 10.1 ఇంచెస్ స్క్రీన్, HVAC కోసం 8.6 ఇంచెస్ స్క్రీన్ లభిస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త జర్మన్ కారు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఇది బీఎండబ్ల్యూ ఐఎక్స్, జాగ్వార్ ఐ-పేస్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

Advertisement
Advertisement