కోడిపుంజుకు కమ్మలు కుట్టించి.. మెడలో మందేసి

12 Aug, 2021 09:07 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా వెంకటేశ్వర్లు అనే స్థానికుడు బుధవారం కోడిపుంజుకు చెవి కమ్మలు కుట్టించి, కోడిమెడలో మద్యం బాటిల్‌ వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాడు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులంతా ఆ భక్తుడి మొక్కును ఆసక్తిగా తిలకించడంతోపాటు ఆ పుంజును చేతుల్లోకి తీసుకుని ఫొటోలు దిగారు. ప్రతి ఏటా అమ్మవారికి ఇలానే మొక్కులు చెల్లిస్తానని ఆయన తెలిపారు.    – కేసముద్రం

చదవండి: పెళ్లి సందడి షురూ! ముహూర్తాలే ముహూర్తాలు!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు