‘ఇవాళ జ్వరం.. రేపు గుండె నొప్పి’.. రాజగోపాల్‌ రెడ్డిపై మంత్రి తలసాని విమర్శలు

25 Oct, 2022 16:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. రాజగోపాల్‌ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశానని, హుజురాబాద్‌, దుబ్బాకలో అభ్యర్థులకు జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని ఎద్దేవా చేశారు. తాము ముందు నుంచే ఇలా జరుగుతుందని ఊహించామని, మునుగోడు ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి తలసాని. 

‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి డ్రామాలు స్టార్ట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశాను. హుజురాబాద్, దుబ్బాక లో అభ్యర్థులకు జరిగినట్టే జరుగుతుంది. ఇవాళ జ్వరం వచ్చింది, రేపు గుండె నొప్పి రావొచ్చు. ఇలాగే కుటుంబం రోడ్డు మీదికి వచ్చి నిరసనలు చేసి సింపతి క్రెయేట్ చేసే ఏడుపులు మొదలవుతాయి. మేము ముందు నుంచి ఇదే చూస్తున్నాం. మేము ఊహించిందే జరిగింది. మునుగోడు ప్రజలు గమనించాలి. మునుగోడు అభివృద్ధి ఏ మేరకు చేసామో గమనించండి. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ డ్రామాలను మునుగోడు ప్రజలు నమ్మకండి. జ్వరం ఒక్కటే కాదు, రేపు తన పైన దాడి చేయించుకొని చేతులు కాళ్ళు విరగొట్టుకుంటాడు. మేము స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నాం’ అని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. 

ఇదీ చదవండి: Munugode Bypoll 2022: ఎల్బీ నగర్‌లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ?

మరిన్ని వార్తలు