ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

12 Mar, 2021 17:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రాష్ట్రంలో జరిగే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎల్లుండి(ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఇక ఈ నెల 17న ఫలితాలు వెలువడనున్నాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ బరిలో 93 మంది అభ్యర్థులు కాగా ఓటర్లు  5,31,268 మంది ఉన్నారు. ఇక మూడు జిల్లాలకు కలిపి మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 799 ఏర్పాటు చేశారు. ఇక నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం బరిలో 71 మంది అభ్యర్థులు కాగా, ఓటర్ల సంఖ్య 5,05,565 గా ఉంది. 731 పోలీంగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు