ఇది దొరల పాలన అనుకుంటున్నారా?.. ఎంపీ అరవింద్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

18 Nov, 2022 13:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎంపీ అరవింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ నేతల దాడి నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఎంపీ అరవింద్‌.. ఎమ్మెల్సీ కవిత, టీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. మా అమ్మను భయపెట్టారు. మహిళా స్టాఫ్‌ను రాళ్లతో కొట్టారు. మా అమ్మపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు?. ఇది దొరల పాలన అనుకుంటున్నారా?. నిజామాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తా.. కవిత పోటీ చేస్తారా?. రండి కొట్లాడదాం.. ఇదే ఫైనలా.. మళ్లీ మాట మారుస్తారా?. కేసీఆర్‌ కుటుంబానికి కుల అహంకారం ఎక్కువ. 

దమ్ముంటే 2024లో మళ్లీ పోటీ చేయ్‌. ఖర్గేకు కవిత ఫోన్‌ చేసిందో లేదో తేలాలి. అది నిజం కాబట్టే కవిత ఇంతలా రియాక్ట్‌ అయ్యారు. కవిత కుల అహంకారంతో మాట్లాడుతోంది. నీ మేనిఫెస్టో మొత్తం చీటింగే.. కేసీఆర్‌పై కేసు పెట్టుకో. పసుపు రైతులు మొత్తం బీజేపీతోనే ఉన్నారు. నాకు తెలిసింది మాట్లాడాను.. అందులో అనుచిత వ్యాఖ్యలు ఏమున్నాయి?. కవిత రాజకీయ జీవితం ముగింపునకు వచ్చింది. నాపై పోటీ చేయాలనుకుంటే స్వాగితిస్తాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అంత సీన్‌ కవితకు లేదు అంటూ సీరియస్‌ అయ్యారు.

ఇక, అంతకుముందు.. ఈ దాడి ఘటనపై ఎంపీ అరవింద్‌.. ప్రధాని మోదీకి ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత ఆదేశాలతోనే నా ఇంటిపై టీఆర్‌ఎస్‌ గుండాలు దాడి చేశారు. ఇంట్లో బీభత్సం సృష్టించి మా అమ్మను బెదిరించారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అరవింద్‌ ఇంటిపై దాడి నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రహాద్‌ జోషి స్పందించారు. ఈ సందర్భంగా జోషి సీరియస్‌ అయ్యారు. కేసీఆర్‌, కేటీఆర్‌ నిరాశలో ఉన్నారు. అందుకే మా ఎంపీ అరవింద్‌ ఇంటిపై దాడి చేయించారు అని ఫైరయ్యారు.

మరిన్ని వార్తలు