Telangana: 20న మొహర్రం సెలవు

18 Aug, 2021 12:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

19న ఐచ్ఛిక సెలవుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

సాక్షి, హైదరాబాద్‌: మొహర్రం మాసం 10వ రోజు ఇచ్చే సాధారణ సెలవును ఆగస్టు 19వ తేదీ(గురువారం) నుంచి 20వ తేదీ(శుక్రవారం)కి మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొహర్రం 9వ రోజు ఇచ్చే ఐచ్ఛిక సెలవును ఆగస్టు 18 నుంచి 19వ తేదీకి మార్పు చేశారు.

నెలవంక ఆధారంగా మొహర్రం మాసం ఒకరోజు ఆలస్యంగా ప్రారంభమైందని, కాబట్టి సెలవులను మార్చాలని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు విజ్ఞప్తి చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. కాగా, మొహర్రం సెలవును గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు