రాష్ట్ర జడ్జీల సంఘం అధ్యక్షుడిగా నర్సింగరావు

31 Oct, 2022 01:16 IST|Sakshi
నర్సింగరావు, మురళీమోహన్‌ 

ఓట్ల ఫలితాలను వెల్లడించిన ఎన్నికల అధికారి

ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్‌ ఏకగ్రీవం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా జిల్లా జడ్జి శ్రీ నందికొండ నర్సింగరావు ఎన్నికయ్యారు. ఈ నెల 15న జరిగిన ఎన్నికల ఫలితాలను ఆదివారం వెల్లడించారు. నర్సింగరావు 87 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారిని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జ్‌ రేణుక యార ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కాళ్లూరి ప్రభాకర్‌రావు, సుదర్శన్, ప్రధాన కార్యదర్శి–కోశాధికారిగా సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.మురళీమోహన్, సహాయ కార్యదర్శులుగా కె. దశరథరామయ్య, జాబిశెట్టి ఉపేందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అలాగే ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా శ్రీమతి శ్రీవాణి, మండ వెంకటేశ్వరరావు, అబ్దుల్‌ జలీల్, సాయికిరణ్, బి. సౌజన్య, బి. భవాని, రాజు ముదిగొండ, చందన, ఫర్హీం కౌసర్, ఉషశ్రీ, సంపత్, ప్రతిక్‌ సిహాగ్‌ ఎన్నికయ్యారు. వీరంతా రెండేళ్లపాటు ఈ పదవుల్లో ఉంటారు. కాగా, న్యాయమూర్తుల సంక్షేమం కోసం కృషి చేస్తానని నందికొండ నర్సింగరావు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు