వీవీ అల్లుడికి ఎన్‌ఐఏ నోటీసులు

7 Sep, 2020 12:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్‌ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్‌ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. అయితే తాజాగా ఎన్‌ఐఏ ఆయనకు నోటీసులు పంపింది. (ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!)

ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్‌ఐఏ ఆదేశించింది. ఎన్‌ఐఏ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫెసర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమా-కొరెగావ్‌ కేసు‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు