Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

4 Dec, 2023 08:28 IST|Sakshi

నల్గొండ: ఉమ్మడి జిల్లాలో నోటాకు భారీగానే ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 11,297 ఓట్లు నోటాకు వచ్చాయి. భువనగిరి నియోజకవర్గంలో 882, ఆలేరు 659, సూర్యాపేట 760, నకిరేకల్‌ 969, తుంగతుర్తి 1,351, మునుగోడు 849, నాగార్జునసాగర్‌ 1,056, మిర్యాలగూడ 527, కోదాడ 887, హుజూర్‌నగర్‌ 843, దేవరకొండ 1,613, నల్లగొండలో 901 ఓట్లు పడ్డాయి.  

>
మరిన్ని వార్తలు