వ్యాక్సిన్‌ వేస్తే.. ఉరేసుకుంటా.. చుక్కలు చూపించిన బామ్మ..

8 Nov, 2021 20:11 IST|Sakshi

సాక్షి, జనగామ: కోవిడ్‌ వ్యాక్సిన్ వేసుకోమంటే.. ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి చుక్కలు చూపించింది. వ్యాక్సిన్‌ వేస్తే.. ఉరి వేసుకుంటానంటూ హడావుడి సృష్టించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధురాలిని వ్యాక్సిన్‌ వేసుకోమని అడగగా వ్యాక్సిన్ వేస్తే  ఉరి వేసుకుంటానంటూ మొండిగా వ్యవహరించింది. 

చదవండి: జొన్నలకు పులి కాపలా!

వైద్య సిబ్బందిని మీరు వెళ్లిపోండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ వృద్ధురాలు తల బాదుకుంది. ఎంతగా నచ్చజెప్పినా ఏమాత్రం వినలేదు. సూది మందంటే చిన్న పిల్లల్లా మారాం చేయడంతో కాస్త ఫన్నీగా అనిపించింది. కొందరు కరోనా టీకా వేయించుకోవటానికి భయపడుతున్నారు. దాన్నో భూతంలా చూస్తున్నారు. మరికొందరు లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపడంలేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఏమాత్రం వారి తీరులో మార్పు రావడం లేదు.
చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు! 

మరిన్ని వార్తలు