ఓయూ పరీక్షలు వాయిదా 

11 Jul, 2022 02:40 IST|Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఇప్పటి వరకు జరుగుతున్న, జూలై 11న జరగనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సీఎం కేసీఆర్‌ విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినందున ఓయూలో జరగనున్న వివిధ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలతో పాటు పీజీ ఇంటర్నల్‌ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించనున్న తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ తేదీలు, ఇతర వివరాలకు విద్యార్థులు రోజూ ఓయూ వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.  

మరిన్ని వార్తలు