హైదరాబాద్‌లో హైటెన్షన్‌.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా ఉగ్రదాడి ప్లాన్‌!

2 Oct, 2022 18:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భారీ ఉగ్ర కుట్ర ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాదులో పలుచోట్ల విధ్వంసాలు సృష్టించేందుకు ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఉగ్రవాదులతో లింకులు ఉన్న జాహిద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, జాహిద్‌ అరెస్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.   

కాగా, దసరా ఉత్సవాలను జాహిద్‌ అండ్‌ టీమ్‌ టార్గెట్‌ చేసింది. జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర చేసింది. హైదరాబాద్‌లో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్ర చేసింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలపై దాడులకు సైతం ప్లాన్‌ చేసినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్‌ నుంచి జాహిద్‌కు ఆదేశాలు అందిన్నట్టు గుర్తించారు. దాడులు చేసేందుకు నాలుగు గ్రనేడ్స్‌ను జాహిద్‌కు పంపిన పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్స్‌ పంపించారు. సోదాల్లో భాగంగా నిందితుల నుంచి 4 గ్రనేడ్లతో పాటు రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ క్రమంలో హైదరాబాద్‌ సీసీఎస్‌, సిట్‌లో జాహిద్‌  అండ్‌ టీమ్‌పై కేసు నమోదు చేశారు. జాహిద్‌తో పాటు మరో ఏడుగురిపై సిట్‌ కేసు నమోదు చేసింది. సుజి, సమీయుద్దీన్‌, అదీల్‌, అప్రోజ్‌, అబ్దుల్‌, సోహెల్‌ ఖురేషిను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండర్ల ద్వారా నిధులు సేకరిస్తున్నట్టు గుర్తించారు.

హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలంటూ పాక్‌ నుంచి జాహిద్‌కు ఆదేశాలు అందినట్టు తెలుసుకున్నారు. కాగా, గతంలో పలు బ్లాస్ట్‌ కేసుల్లో అబ్దుల్‌ జాహిద్‌ నిందితుడిగా ఉన్నాడు. 2005లో బేగంపేట్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై సూసైడ్‌ అటాక్‌కు జాహిద్‌ ప్లాన్‌ చేశాడు. ఫర్హతుల్లా ఘోరీ, అణు హంజాల, అబ్దుల్‌ మజీద్‌లతో కలిసి కుట్ర చేశారు. 2002 సికింద్రాబాద్‌ గణేష్‌ టెంపుల్‌ వద్ద కుట్రకు ప్లాన్‌ చేశారు. 2005లో బేగంపేట్‌ టాస్క్‌ఫోర్స్‌ మానవ బాంబు పేలుళ్లను సైతం జాహిద్‌ ప్లాన్‌ చేశాడు. హైదరాబాద్‌లోనే ఉంటూ జాహిద్‌ ఉగ్ర కుట్రలు చేస్తున్నాడు. 

మరిన్ని వార్తలు