కేటీఆర్‌ చేనేత చాలెంజ్‌ స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌ 

8 Aug, 2022 02:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేనేత దినోత్సవం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీ రామా రావు విసిరిన చేనేత చాలెంజ్‌ను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్వీకరించారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ ’రామ్‌ భాయ్‌ చాలెంజ్‌ను స్వీకరించా. ఎందుకంటే చేనేత వర్గాలంటే నాకు ప్రేమ, అభిమానం’ అంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

అనంతరం పవన్‌ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఏపీ మాజీ మంత్రి బాలి నేని శ్రీనివాసరెడ్డి, తెలంగాణకు చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌లను నామినేట్‌ చేస్తూ చేనేత చాలెంజ్‌ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను షేర్‌ చేయాలని వారిని కోరారు. కాగా, పవన్‌ స్పందన పట్ల కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌లకు కూడా కేటీఆర్‌ చేనేత చాలెంజ్‌ విసిరారు.   

మరిన్ని వార్తలు