HYD: నగర శివారులో రేవ్‌ పార్టీ భగ్నం.. 

28 Jun, 2022 07:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులో జరుగుతున్న రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇనాంగూడలో యువత రేవ్‌ పార్టీ జరుపుకుంటున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు రైడ్స్‌ చేశారు. ఈ దాడుల్లో భాగంగా 10 మందికి పైగా యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల సందర్భంగా మద్యం సహా హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: చదువు పేరుతో హైదరాబాద్‌లో సహజీవనం.. ఇంటికి వచ్చాక ..

మరిన్ని వార్తలు