బతుకు దెరువుబాటలో.. చదువు చెప్పిన సారు

9 Apr, 2021 09:15 IST|Sakshi
తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్న ఉపాధ్యాయుడు శివరామకృష్ణ

బన్సీలాల్‌పేట్‌: కరోనా కాటుకు ఎన్నో  జీవితాలు కకావికలం అయ్యాయి. పలువురు ఉపాధి కోల్పోయి వీధి పాలయ్యారు. ఇదే కోవలో ప్రైవేటు టీచర్ల పరిస్ధితి దయనీయంగా మారింది. విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బడి పంతుళ్లు రోడ్ల పాలయ్యారు. కొందరు కూరగాయలు అమ్ముతుంటే.. మరికొందరు చిరు వ్యాపారులుగా మారి పొట్టపోసుకుంటున్నారు.

బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ బోలక్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ప్రైవేట్‌ స్కూల్‌ అధినేత శివరామకృష్ణ  తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. బతుకు దెరువు కోసం తప్పనిసరి అయిందని బోలక్‌పూర్‌ సెయింట్‌ సాయి హైస్కూల్‌ అధినేత శివరామకృష్ణ్ణ సాక్షితో వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్‌ స్కూళ్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.   
(చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు