చిన్నారుల్లో సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇలా చేయండి

6 Dec, 2023 21:00 IST|Sakshi

చిన్నారుల ఆరోగ్యం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఓ వైపు తల్లిదండ్రుల్లో అవగాహన లోపం, మరోవైపు జంక్‌ ఫుడ్‌ వీర విహారం.. పాఠశాల విద్యార్ధుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవలే ఏఐజీ ఆసుపత్రి నిర్వహించిన ఓ సర్వేలో శారీరకంగానే కాక మానసికంగా కూడా అనారోగ్యం పాలు జేసే శక్తి అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు ఉందని దీనిని వినియోగిస్తున్న వారిలో చిన్నారులే అధికమని తేలింది. ఈ సందర్భంగా 8–5–1–0 పేరిట ఒక హెల్త్‌ ఫార్ములాను ప్రతిపాదించారు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఫ్యూచర్‌ ఫుడ్‌ ఫౌండేషన్, కంట్రీ డిలైట్, పలు పాఠశాలల ఆధ్వర్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఈ ఫార్ములా రూపకర్తలు మాట్లాడారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే..

కారణాలెన్నో..
నిశ్చల జీవనశైలి, పెరిగిన స్క్రీన్‌ సమయం  శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగం పెరగడం, అవుట్‌డోర్‌ లో ఆటలకు దూరంగా ఉండటం వలన వ్యాయామం తగ్గిపోయింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చక్కెరలు  అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ప్రాసెస్‌ చేసిన ఆహారాల వినియోగం పెరిగిపోయింది. ఇది ఊబకాయంతో మొదలై గుండె  సంబంధ సమస్యల దాకా దారితీసింది. కాలుష్య కారకాలు  టాక్సి¯Œ ్సతో సహా పర్యావరణ కారకాలు పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య ప్రమాదాలను మరింత Mపెంచుతున్నాయి. జీవనశైలి కారకాలకు మించి, పిల్లల ఆరోగ్యం క్షీణించడంలో సామాజిక అంశాలు కూడా పాత్ర పోషిస్తాయి.

సమగ్ర వికాసానికి ఈ హెల్త్‌ ఫార్ములా..
పాఠశాల పిల్లల్లో ఆరోగ్యాన్ని, సమగ్ర వికాసాన్ని పునర్నిర్వచించే లక్ష్యంతో ఈ 8–5–1–0 ఫార్ములా రూపొందింది. రోజుకి  8గంటల నిద్ర , 5 రకాల పండ్లు కూరగాయలు, 1 గంట వ్యాయామం, హాని కలిగించే ఆహారం, అలవాట్లను సున్నాకి చేర్చడం...అనేదే ఈ ఫార్ములా అంతరార్ధం.  పోషకాహారం, వ్యాయామం, తగినంత విశ్రాంతిల మేలు కలయిక ఇది. తల్లిదండ్రులు  పాఠశాలలకు ఆచరణాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. పిల్లలను సరైన ఆరోగ్యం వైపు నడిపిస్తుంది. దీని అమలులో భాగంగా జీవనశైలి మార్పులు చేయాల్సి ఉంటుంది.  ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇదొక అలవాటుగా  మారడానికి కొంత వ్యవధి పడుతుంది. ఇది వారాల నుంచి నెలల వరకు ఉండవచ్చు.  సాధారణంగా పెద్ద పిల్లల కంటే చిన్నారులు దీన్ని చాలా సులభంగా అలవరచుకోవచ్చు. . ఇంటి వాతావరణం  తల్లిదండ్రుల ప్రమేయాన్ని బట్టి ఈ వ్యవధి ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు వారాల్లోనే అలవాటు పడతారు, మరికొందరికి నెలలు పట్టవచ్చు.

ఆరోగ్య అక్షరాస్యత అవసరం...
నేటి పాఠ్యాంశాల్లో ఆహార అక్షరాస్యత తప్పనిసరి అని అన్ని పాఠశాలల్లో ఏకాభిప్రాయం వచ్చింది.  ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశం 8–5–1–0 నియమాన్ని ఎలా అమలులోకి తీసుకురావాలి అనేదాన్ని చర్చించింది.  దీని పట్ల పాఠశాలల నుండి స్పందన ప్రోత్సాహకరంగా ఉంది,  కొన్ని పాఠశాలలు ఇప్పటికే వారి సాధారణ అభ్యాసాలు/తరగతులలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతి పెంచేలా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.  ఆహార అక్షరాస్యతను పెంపొందించడానికి  భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పని చేయడానికి  ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మనకు అవసరం.

ఈ సందర్భంగా కంట్రీ డిలైట్‌ సహ వ్యవస్థాపకులు గాదె చక్రధర్‌  మాట్లాడుతూ దేశ భవితకు మూల స్థంభాల్లాంటి చిన్నారుల ఆరోగ్యకరమైన భవిత విషయంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములం కావాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమలో చేతులు కలిపామన్నారు.  ఈ హెల్త్‌ ఫార్ములాను స్వాగతిస్తున్నామన్నారు. ఫుడ్‌ ఫ్యూచర్‌  ఫౌండేషన్‌ నిర్వాహకులు పవన్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాఠశాలలన్నింటికీ ఈ ఫార్ములా చేరువయ్యేలా పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: జస్ట్‌ ఈమూడు వ్యాయామాలు చేయండి! బరువు తగ్గడం ఖాయం!

>
మరిన్ని వార్తలు