Nampally Fire Accident: అగ్ని ప్రమాదాలకు అడ్డగా హైదరాబాద్‌.. రేవంత్‌ సీరియస్‌ కామెంట్స్‌

13 Nov, 2023 12:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని సంచలన కామెంట్స్‌ చేశారు. 

కాగా, నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్‌ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. ఈ జరిగిన అ‍గ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయం. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కారు మరమ్మత్తులు చేయడం ఏంటి?. రెసిడెన్షియల్‌ ఏరియాలో కెమికల్‌ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు. 

ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో మృతిచెందిన వారికి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు