యువతిపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ దాడి

14 Sep, 2020 10:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శేరిలింగంపల్లి కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ సోమవారం ఓ యువతిపై దాడి చేశారు. కార్‌ పార్కింగ్‌ వివాదంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసినట్లు తెలుస్తోంది. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్ పేజ్2 కాలనీలో నాగేంద్ర యాదవ్ నివాసముంటున్నారు. అదే కాలనీలో వేణుగోపాల్‌ కుటుంబం కూడా ఉంటుంది. అక్కడికి కారులో వచ్చిన వేణుగోపాల్‌ కుమార్తె అడ్డంగా ఉన్న కార్పొరేటర్‌ కారు తీయాలని కోరింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అది దాడి చేసేంతగా పెరిగింది.

ఈ గొడవను వేణుగోపాల్‌ రెండో కుమార్తె వీడియో తీసింది. షార్ట్‌, బనియన్‌పై ఉన్నానని వీడియో తీయ్యొద్దని కార్పొరేటర్‌ ఆ యువతిని వారించారు. అయినా వినకుండా వీడియో తీయడంతో వివాదం మరింత ముదిరింది. ఇద్దరు చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురిపైన కేసు నమోదయినట్లు చందానగర్‌ ఇన్స్పెక్టర్ రవీంద్ర తెలిపారు. కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పై 323,509 సెక్షన్‌ల కింద కేసు నమోదు  చేసిన పోలీసులు యువతి పైన 448,504 సెక్షన్ల కింద కేసు పెట్టారు. 


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు