సింగరేణిలో కొత్త ఓసీపీ

5 Feb, 2022 01:48 IST|Sakshi

33 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు

11 ఏళ్ల జీవిత కాలం.. రూ.471.19 కోట్ల వ్యయం

నేడు సింగరేణి డైరెక్టర్ల చేతుల మీదుగా ప్రారంభం

గోదావరిఖని: సింగరేణిలో శనివారం మరో ఓపెన్‌ కాస్ట్‌గని (ఓసీపీ) ప్రారంభం కానుంది. పెద్దపల్లి జిల్లాలోని ఈ గనిలో 33 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. 11 సంవత్సరాల పాటు ఏటా 3 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీయనున్నారు. రూ.471 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అధికారులు ప్రభావిత గ్రామాలైన సుందిళ్ల, ముస్త్యాల, జనగామల్లో ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేశారు.

ఇప్పటికే ఓబీ పనులు ప్రారంభమయ్యాయి. సంస్థలో ప్రస్తుతం 18 ఓసీపీలు ఉన్నాయి. కొత్త ఓసీపీ ఏర్పాటుతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు చేతులమీదుగా గనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా ఓసీపీలో పేలుళ్ల కారణంగా ఇబ్బందులు వస్తాయని, అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతాయనే ఆందోళన ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. కాగా, సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు