జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం

10 Oct, 2021 09:05 IST|Sakshi

సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నివాస గుడిసె కూలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు.

గ్రామానికి చెందిన హరిజన్ మోషకు భర్య శాంతమ్మ, కుమారులు చిన్న, రాము, చరణ్, తేజ కూతురు స్నేహ ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా రాత్రి గుడిసేలో నిద్రిస్తుండగా వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భార్యభర్తలతో సహా నలుగురు పిల్లలు చనిపోయారు. కూతురు స్నేహకు తీవ్రగాయాలు కావటంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

చదవండి: (ప్రయాణంలో విషాదం.. ఆరుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు