వివాహితతో ప్రేమ.. యువకుడిని దారుణంగా కొట్టి 

10 Oct, 2021 09:52 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహితతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే కారణంగా ఓ యువకుడిపై అత్యంత పాశవీకంగా దాడి చేసి.. కర్రలతో కొట్టి చంపారు కొందరు దుండగులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌  కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మరో విషాదకర అంశం ఏంటంటే బాధితుడిని హత్య చేసి.. అతడి ఇంటి ముందే పడేసి వెళ్లారు నిందితులు. ఆ వివరాలు.. 

ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. రాజస్తాన్‌, హ‌నుమాన్‌ఘ‌ఢ్‌ ప్రేమ్‌పురా ప్రాంతానికి చెందిన జగ్దీష్‌ మేఘ్వాల్‌ అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. దీని గురించి సదరు వివాహిత భర్తకు తెలిసింది. అతడు జగ్దీష్‌పై కోపం పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జగ్దీష్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న సదరు వివాహిత భర్త.. మరికొందరు తన కుటుంబ సభ్యలతో కలిసి జగ్దీష్‌ను కిడ్నాప్‌ చేశాడు.
(చదవండి: ఎద్దు దాడితో నుజ్జునుజ్జైన ముఖం.. 11 నెలలు.. 3 సర్జరీలు)

అనంతరం అతడిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. దారుణంగా కొట్టారు. ఈ క్రమంలో జగ్దీష్‌ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకువచ్చి జగ్దీష్‌ ఇంటి ముందు పడేసి వెళ్లారు నిందితులు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి దొరకలేదు.
(చదవండి: విషాదం: ఊపిరి పోస్తుందనుకుంటే నిలువునా ప్రాణం తీసింది)

ఇక జగ్దీష్‌పై దాడి చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మృతుడి త‌ల్లితండ్రుల ఫిర్యాదు ఆధారంగా 11 మందిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. నిందితులంద‌రినీ అరెస్ట్ చేసే వ‌ర‌కూ ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు నిర‌స‌న‌ల‌కు దిగారు.

చదవండి: భార్య మీద అనుమానం.. 3 నెలలుగా 30కేజీల ఇనుప చైన్‌తో..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు