‘రాఖీ’కి బదులు వినూత్న వేడుక 

22 Aug, 2021 09:12 IST|Sakshi
అచ్చంపేట భక్త మార్కండేయ ఆలయంలో మగ్గం నేస్తున్న పద్మశాలీలు

సాక్షి, అచ్చంపేట(మహబూబ్‌నగర్‌): సాధారంగా అక్కా చెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుక చేసుకుంటారు. కానీ నియోజకవర్గంలో మాత్రం పద్మశాలీలు వినూత్నంగా రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకుని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ. 

గాయత్రీ మాలధారణ.. 
పత్తితో తయారు చేసిన దారంతో కంకణం, జంధ్యం (గాయత్రిమాల) ధరిస్తారు. గాయత్రి హోమం నిర్వహించిన తరువాత పద్మశాలీలంతా నూలుతో తయారు చేసిన జంద్యాలను 41ఏళ్లు సామూహికంగా ధరిస్తారు. అనంతరం పూజలు నిర్వహిస్తారు. గతేడాది కరోనా వల్ల నిర్వహించలేకపోయారు. ఈసారి మళ్లీ నిర్వహించేందుకు భక్తమార్కడేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూలు పూర్ణిమకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు