‘సారూ.. బడిలో మంచినీళ్లు లెవ్వు’

4 Apr, 2023 10:33 IST|Sakshi

సాక్షి,జగిత్యాల టౌన్‌: ‘సారూ మా బడిలో తాగేందుకు మంచినీళ్లు లెవ్వు. మూత్రశాలలు పనిచేయడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నం. మీరైనా జోక్యం చేసుకోండి’ అని ఆరో తరగతి విద్యార్థి ప్రజావాణి ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన రాజమల్లు కుమారుడు పి.విశ్వాంక్‌ ప్రభుత్వ ఓల్డ్‌ హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు.

తమ పాఠశాలలో మూత్రశాలలు శిథిలమయ్యాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఒకటి, రెంటికి బడి సమీపంలోని పబ్లిక్‌ సులభ్‌ కాంప్లెక్స్‌లోకి వెళ్తున్నా­మని, అక్కడ నిర్వాహకులు పైసలు వసూలు చేస్తున్నారని తెలిపాడు. తమతోపాటు ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి అని వివరించాడు. అసలే పేదోళ్లమని, తాముపైసలు చెల్లించలేకపోతున్నా­మని వాపోయాడు. ప్రస్తుతం ఎండాకాలమని, దాహంతో తపి స్తున్నామన్నాడు. ప్రజావాణి ద్వారా జిల్లా సంక్షేమాధికారి నరేశ్‌కు వినతిపత్రం అందజేశాడు.

మరిన్ని వార్తలు